EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మద్దూర్ లో సద్దుల బతుకమ్మ ఏర్పాట్ల పరిశీలన

    Author R K SRINIVAS | 12 Oct 2026, 08:58 PM | TELANGANA
    మద్దూర్ లో సద్దుల బతుకమ్మ ఏర్పాట్ల పరిశీలన

    వేడుకలకు హాజరయ్యే మహిళలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు
    సిద్దిపేట జిల్లా, మద్దూరు, అక్టోబర్‌ 12, హిందుస్థాన్‌ మీడియా: బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మద్దూరు గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లను సోమవారం ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో వెంకటేశ్వర్లు పరిశీలించారు. గ్రామ సర్పంచ్‌ దామెర మల్లేశం ఆధ్వర్యంలో ఏర్పాట్లను పరిశీలించి, అవసరమైన సౌకర్యాలపై చర్చించారు.ఈ సందర్భంగా సర్పంచ్‌ దామెర మల్లేశం మాట్లాడుతూ, వేడుకలకు హాజరయ్యే మహిళలు, గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సద్దుల బతుకమ్మ వేడుకలను ప్రశాంత వాతావరణంలో, సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి అశోక్‌ పాల్గొన్నారు.

    మద్దూర్ లో సద్దుల బతుకమ్మ ఏర్పాట్ల పరిశీలన - Additional Image