EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చేర్యాల బేతనియ ప్రార్ధన మందిరంలో ఘనంగా రజోత్సవ వేడుకలు

    Author P శివశంకర్ | 12 Oct 2026, 08:28 PM | TELANGANA
    చేర్యాల బేతనియ ప్రార్ధన మందిరంలో ఘనంగా రజోత్సవ వేడుకలు

    25వ వార్షికోత్సవంలో ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధన కార్యక్రమాలు
    చేర్యాల, అక్టోబర్‌ 12, మరో కిరణాలు: చేర్యాల పట్టణంలోని బేతనియ మందిరం 25వ వార్షికోత్సవం (రజతోత్సవం) పాస్టర్‌ సత్తనపల్లి విక్టర్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక సంఘ విశ్వాసులతో పాటు వివిధ సంఘాలకు చెందిన పాస్టర్లు, క్రైస్తవ విశ్వాసులు, ఇతర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.మందిరం 25 ఏళ్ల ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. విశ్వాసులు భక్తిశ్రద్ధలతో ప్రార్థనల్లో పాల్గొని ఆధ్యాత్మిక సందేశాలను ఆలకించారు. వివిధ సంఘాలకు చెందిన పాస్టర్లు, విశ్వాసులు ఒకే వేదికపై కలుసుకోవడంతో మందిర ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    ప్రేమ, విశ్వాసం, ఐక్యత సందేశాలతో నిర్వహించిన ఈ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య కొనసాగాయి. బేతనియ మందిరం 25వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం స్థానికంగా ప్రత్యేకతను సంతరించుకుంది.

    చేర్యాల బేతనియ ప్రార్ధన మందిరంలో ఘనంగా రజోత్సవ వేడుకలు - Additional Image