EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రామగుండం నియోజకవర్గ AIAKS కన్వీనర్ గా శ్రీపెల్లి రాజు చారి

    Author THADEM PRASHANTH | 12 Oct 2026, 07:38 PM | TELANGANA
    రామగుండం నియోజకవర్గ AIAKS కన్వీనర్ గా శ్రీపెల్లి రాజు చారి

    AIFB అనుబంధ రైతు సంఘంలో కీలక బాధ్యతలు
    రామగుండం, అక్టోబర్‌ 12, హిందుస్థాన్‌ మీడియా: AIFB పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న అఖిల భారత రైతు సంఘం (AIAKS) రామగుండం నియోజకవర్గ కన్వీనర్‌గా శ్రీపెల్లి రాజు చారి ఎన్నికయ్యారు. అంతర్గాంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. జనరల్‌ సెక్రటరీ ఆండె బీరన్న మద్దతుతో పాటు మైసయ్య, లక్ష్మారెడ్డి, బి. రాజు తదితర నాయకులు సహకరించారు.ఈ సందర్భంగా శ్రీపెల్లి రాజు చారి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకులకు, సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. నాయకుల మార్గదర్శకత్వంలో రైతు సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ, రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. రైతుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, సంఘాన్ని గ్రామస్థాయిలో విస్తరించడం కోసం కృషి చేస్తానని తెలిపారు.నూతన బాధ్యతలు చేపట్టిన శ్రీపెల్లి రాజు చారికి పలువురు నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు.