EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధనతో ఆధ్యాత్మిక శోభ!

    Author R K SRINIVAS | 11 Oct 2026, 07:10 PM | TELANGANA
    నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధనతో ఆధ్యాత్మిక శోభ!

    మద్దూరులో ఘనంగా దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు
    సిద్దిపేట జిల్లా, మద్దూరు, అక్టోబర్‌ 11, హిందుస్థాన్‌ మీడియా: మద్దూరు మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్‌ దామెర మల్లేశం ఆధ్వర్యంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల తొలిరోజు పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి పనుగంటి తిరుపతయ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.
    భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిపై తమ భక్తిని చాటుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. భక్తులు దుర్గామాతను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నవరాత్రి ఉత్సవాలను భక్తిప్రపత్తులతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు, భక్తులు పాల్గొన్నారు.