EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బంజారుపల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జనగాం వెంకటేశ్వర్లు

    Author THADEM PRASHANTH | 11 Oct 2026, 05:45 PM | TELANGANA
    బంజారుపల్లి గ్రామ కాంగ్రెస్  అధ్యక్షుడిగా జనగాం వెంకటేశ్వర్లు

    నూతన గ్రామ కమిటీ ఎన్నిక.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని సభ్యుల వెల్లడి
    నెక్కొండ, అక్టోబర్‌ 11, హిందుస్థాన్‌ మీడియా: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు, నెక్కొండ మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు లావుడ్య తిరుమల్‌ చౌహాన్‌ సూచనలతో ఆదివారం బంజారుపల్లి గ్రామ కాంగ్రెస్‌ కమిటీని ఎన్నుకున్నారు. గ్రామ సర్పంచ్‌ భూక్య రమేష్‌ రాథోడ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో గ్రామ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా జనగాం వెంకటేశ్వర్లు, వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా పొన్నాల స్వామి, మంద రాజు, ప్రధాన కార్యదర్శిగా భూక్య శంకర్‌లాల్‌, కార్యదర్శులుగా పొన్నాల కృష్ణంరాజు, పాపావత్‌ శంకర్‌, గౌరవ అధ్యక్షుడిగా భూక్య తిర్నాల్‌ ఎన్నికయ్యారు.
    గ్రామ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బోడ గణేష్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా మంకాల క్రాంతి, కందికొండ బలరాజ్‌, ప్రధాన కార్యదర్శిగా మాచర్ల భాస్కర్‌, కార్యదర్శులుగా గాలి సుమన్‌, బోడ అనిల్‌ ఎన్నికయ్యారు. అనుబంధ విభాగాల అధ్యక్షులుగా కిసాన్‌ సెల్‌కు పొన్నాల రామన్న, ఎస్సీ సెల్‌కు గాలి అశోక్‌, ఎస్టీ సెల్‌కు బోడ రాజేష్‌, బీసీ సెల్‌కు పొన్నాల విజేందర్‌, మైనారిటీ సెల్‌కు ఎం.డి. షర్వార్‌, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఎరుకల సంతోష ఎంపికయ్యారు.