EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మోదీ దిష్టిబొమ్మ దహనానికి కాంగ్రెస్ యత్నం అడ్డుకున్న పోలీసులు

    Author R K SRINIVAS | 09 Oct 2026, 08:29 AM | TELANGANA
    మోదీ దిష్టిబొమ్మ దహనానికి కాంగ్రెస్ యత్నం అడ్డుకున్న పోలీసులు

    మద్దూరులో పోలీసులకు, కాంగ్రెస్‌ నాయకులకు మధ్య వాగ్వాదం
    సిద్దిపేట జిల్లా, మద్దూరు, అక్టోబర్‌ 8, హిందుస్థాన్‌ మీడియా: మద్దూరులో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మారెళ్ల భాస్కర్‌ రెడ్డి, చేర్యాల మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ బోయిని శ్రీనివాస్‌ తదితరులు దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్‌ నాయకులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో దిష్టిబొమ్మ దహనం నిలిచిపోయింది.