EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మంచం నుంచి జారిపడి వ్యక్తి మృతి

    Author R K SRINIVAS | 08 Oct 2026, 08:16 PM | TELANGANA
    మంచం నుంచి జారిపడి వ్యక్తి మృతి

    దూల్మిట్ట, అక్టోబర్‌ 8, హిందుస్థాన్‌ మీడియా: అనారోగ్యంతో మంచానికే పరిమితమైన మామిడాల మల్లయ్య (56) మంచం నుంచి ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నెల 6న జరిగిన ప్రమాదంలో గాయపడిన మల్లయ్యను హుస్నాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. మృతిపై ఎలాంటి అనుమానం లేదని భార్య కనుకవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ అసిఫ్‌ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.