EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మర్పడగ క్షేత్రంలో వైభవంగా ఆర్ద్రా మహోత్సవం

    Author B SRAVAN KUMAR | 03 Oct 2026, 10:08 PM | TELANGANA
    మర్పడగ క్షేత్రంలో వైభవంగా ఆర్ద్రా మహోత్సవం

    భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. సంతాన మల్లికార్జున స్వామికి విశేష అభిషేకాలు

    అన్నప్రసాద వితరణలో పాల్గొన్న భక్తులు
    సిద్దిపేట జిల్లా, అక్టోబర్‌ 3, కొండపాక, హిందుస్థాన్ మీడియా: కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని శ్రీవిజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున క్షేత్రంలో శనివారం ఆర్ద్రా మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. క్షేత్ర నిర్వాహకులు చెప్పెల హరినాథశర్మ పర్యవేక్షణలో ఉదయం 9 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
    ముందుగా గణపతి పూజ, స్వస్తివాచనం నిర్వహించి అనంతరం నవగ్రహ, దిక్పాలక, రుద్రకలశ స్థాపన కార్యక్రమాలను నిర్వహించారు. స్థాపిత దేవతా పూజ అనంతరం సంతాన మల్లికార్జున స్వామివారికి విశేష పంచామృత, ఫలరస అభిషేకం నిర్వహించారు. అనంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకం చేశారు.
    తదుపరి స్థాపిత దేవతా హవనం, సంతాన పాశుపత హవనం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. విజయదుర్గా మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
    మోహనకృష్ణశర్మ వైదిక నిర్వహణలో పూజా కార్యక్రమాలు కొనసాగగా, ఋత్విజులుగా బి. లక్ష్మణరావు, కృష్ణకిషోర్‌ పాండే వ్యవహరించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.కార్యక్రమంలో క్షేత్ర నిర్వహణ కమిటీ సభ్యులు చీకోటి మల్లికార్జున్‌, మర్యాల వీరేశం, దేవసాని మల్లేశం, మర్యాల రవీందర్‌, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.