EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

    Author THADEM PRASHANTH | 02 Oct 2026, 06:06 PM | TELANGANA
    భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

    బైరాన్‌పల్లిలో ప్రత్యేక గ్రామసభ

    వర్షపు నీటిని భూమిలోకి ఇంకించేలా చర్యలు చేపట్టాలి: సర్పంచ్‌ బర్మా రాజమల్లయ్య
    సిద్దిపేట జిల్లా, అక్టోబర్‌ 2, దూల్మిట్ట, హిందుస్థాన్ మీడియా: స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్‌ 17 నుంచి కొనసాగుతున్న కార్యక్రమాల్లో భాగంగా మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని బైరాన్‌పల్లి గ్రామంలో శుక్రవారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్‌ బర్మా రాజమల్లయ్య అధ్యక్షతన జరిగిన ఈ గ్రామసభకు పాలకవర్గ సభ్యులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు హాజరయ్యారు.
    గ్రామసభకు ముందు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా సర్పంచ్‌ బర్మా రాజమల్లయ్య, పాలకవర్గ సభ్యులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సిబ్బందిని సన్మానించారు.
    తదుపరి నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో గ్రామంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ VB-G RAM G కార్యక్రమం ద్వారా ఇంకుడు గుంతలు, పాంపండ్‌ ఊటకుంటలు, బోర్‌వెల్‌ రీచార్జ్‌ తదితర 375కు పైగా రకాల పనులు చేపట్టే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రాధాన్యతను గ్రామ ప్రజలకు వివరించారు.
    భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో ప్రతి చిన్న, సన్నకారు రైతు తమ వ్యవసాయ పొలాల్లో ఊటకుంటలు, పాంపండ్‌ గుంతలు ఏర్పాటు చేసుకుని వర్షపు నీటిని భూమిలోకి ఇంకించేలా చర్యలు చేపట్టాలని సర్పంచ్‌ సూచించారు. భూగర్భ జలాల పరిరక్షణ, నీటి వనరుల పెంపుదలకు గ్రామ ప్రజలంతా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
    కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ తెలిజూరి సిద్ధులు, పంచాయతీ కార్యదర్శి కట్కూరి రాజు, వార్డు సభ్యులు దాసరి సుగుణ, కత్తుల రాజు, పులిగిల్ల లలిత, కాలి జంపన్న, కొత్తపల్లి బాపురాజు, మోటం వినోద, పుప్పాల సింధుప్రియ, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉమేష్‌, అంగన్వాడీ టీచర్లు ఎం.విజయ, ఎం.స్వరూప, వీఓ అధ్యక్షురాలు చెలిమెల కళ్యాణి, సీఏ బండి పద్మ, ఏఎన్‌ఎం రత్నకుమారి, ఆశ కార్యకర్తలు దానమ్మ, బాలమ్మతో పాటు గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

    భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - Additional Image