EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులకు తప్పక గుర్తింపు ఉంటుంది : RUPPT

    Author P శివశంకర్ | 26 Sep 2026, 04:34 PM | TELANGANA
    అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులకు తప్పక గుర్తింపు ఉంటుంది : RUPPT

    మండల ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

    చేర్యాల, మద్దూరు మండలాల ఉత్తమ తెలుగు, హిందీ ఉపాధ్యాయులకు సత్కారం
    చేర్యాల, సెప్టెంబర్‌ 26, హిందుస్థాన్ మీడియా: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల చేర్యాల, మద్దూరు మండలాల్లో విద్యాశాఖ ద్వారా మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన తెలుగు, హిందీ ఉపాధ్యాయులను రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ తెలంగాణ (RUPPT) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
    పెద్దమగడ్డ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల బాలురలో కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు వి. సురేష్‌ అధ్యక్షతన నిర్వహించిన తెలుగు కాంప్లెక్స్‌ సమావేశంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. చేర్యాల మండలం నుంచి ఎంపికైన రాసూరి శ్రీనివాస్‌, కత్తుల కనకారెడ్డి, మద్దూరు మండలం నుంచి ఎంపికైన చల్ల కరుణాకర్‌, ఇర్ఫానా బేగంలను సత్కరించి అభినందించారు.
    ఈ సందర్భంగా RUPPT రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుళ్లపల్లి తిరుమల కాంతికృష్ణ మాట్లాడుతూ భాషా ఉపాధ్యాయులు విద్యార్థుల అభ్యున్నతి కోసం అంకితభావంతో పనిచేస్తున్నారని, వారి కృషికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు భవిష్యత్తులోనూ మరిన్ని మంచి ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.
    కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు వి. సురేష్‌ మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారి సేవలను ఆదర్శంగా తీసుకుని మిగిలిన ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు మెరుగైన బోధన అందించి మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.
    ఈ కార్యక్రమంలో మండల రిసోర్స్‌ పర్సన్స్‌ కనకలింగం, శ్రీనివాస్‌, రఘుపతి, ఉపాధ్యాయులు నవీన్‌, శ్రీనివాస్‌, రమేష్‌, రజిత, శారద, కవిత, శ్రీలక్ష్మి, భాగ్యలక్ష్మి, మంజుల తదితరులతో పాటు చేర్యాల, మద్దూరు మండలాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.