EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రభుత్వ బడి టాపర్ రమ్యకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లక్ష నగదు ప్రోత్సాహం..

    Author R K SRINIVAS | 25 Sep 2026, 11:02 PM | TELANGANA
    ప్రభుత్వ బడి టాపర్ రమ్యకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లక్ష నగదు ప్రోత్సాహం..

    జనగామ నియోజకవర్గ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థినికి సన్మానం
    సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్‌ 25, హిందుస్థాన్ మీడియా: ధూల్మిట్ట జడ్పీహెచ్‌ఎస్‌లో చదివిన తోర్నాల గ్రామానికి చెందిన విద్యార్థిని రమ్య పదో తరగతి పరీక్షల్లో 571 మార్కులు సాధించి జనగామ నియోజకవర్గ స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. ఆమె ప్రతిభను గుర్తించి శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
    ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా రమ్యను సన్మానించి రూ.లక్ష నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రమ్యతో పాటు ఆమె తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గవర్నర్‌ అభినందించారు.ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి రమ్య సాధించిన విజయం అభినందనీయమని, ఆమె ప్రతిభ ఇతర విద్యార్థులకు స్ఫూర్తినిస్తుందని కార్యక్రమంలో పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.

    ప్రభుత్వ బడి టాపర్ రమ్యకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లక్ష నగదు ప్రోత్సాహం.. - Additional Image