EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గణేష్ నిమజ్జనంలో డీజే లకు బ్రేక్..!

    Author P శివశంకర్ | 22 Sep 2026, 09:43 AM | TELANGANA
    గణేష్ నిమజ్జనంలో డీజే లకు బ్రేక్..!

    ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిమజ్జనం నిర్వహించాలి

    డీజే ఆపరేటర్లకు చేర్యాల పోలీసుల కౌన్సెలింగ్‌.. ఎంఆర్‌ఓ ఎదుట బైండోవర్‌
    చేర్యాల, సెప్టెంబర్‌ 22, హిందుస్థాన్ మీడియా:
    గణేష్‌ నిమజ్జనం సందర్భంగా డీజే సౌండ్‌ సిస్టమ్‌లను అధిక శబ్దంతో వినియోగించకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని చేర్యాల పోలీసులు డీజే ఆపరేటర్లకు సూచించారు.ఈ మేరకు సోమవారం చేర్యాల పోలీస్‌ స్టేషన్‌కు డీజే ఆపరేటర్లను పిలిపించిన పోలీసులు వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా బేస్‌ సౌండ్‌ ఎక్కువగా పెట్టకూడదని, అధిక శబ్దంతో ప్రజలు, వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
    గణేష్‌ నిమజ్జనాన్ని భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని, పోలీసుల సూచనలు మరియు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు స్పష్టం చేశారు. నిమజ్జన ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు, డీజే ఆపరేటర్లు పోలీసులకు సహకరించాలని కోరారు.కౌన్సెలింగ్‌ అనంతరం డీజే ఆపరేటర్లను ఎంఆర్‌ఓ సమక్షంలో బైండోవర్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.
    ఈ కార్యక్రమంలో చేర్యాల సీఐ బానోతు రమేష్‌ నాయక్‌, ఎస్‌ఐ అపూర్వ రెడ్డి తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.