EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మద్దూర్ నూతన ఎంపీడీవో గా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ

    Author R K SRINIVAS | 21 Sep 2026, 08:04 PM | Array
    మద్దూర్ నూతన ఎంపీడీవో గా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ

    మండల అభివృద్ధికి కృషి చేస్తా: ఎంపీడీవో శ్రీనివాస్‌
    మద్దూరు, సెప్టెంబర్‌ 21, హిందుస్థాన్ మీడియా:
    మద్దూరు మండల పరిషత్‌ అభివృద్ధి అధికారిగా (ఎంపీడీవో) సీహెచ్‌ శ్రీనివాస్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మద్దూరు మండల పరిషత్‌ కార్యాలయంలో ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
    ఇంతకుముందు మద్దూరు ఎంపీడీవోగా పనిచేసిన రాంమోహన్‌ బదిలీపై వేరే ప్రాంతానికి వెళ్లడంతో ఆయన స్థానంలో సీహెచ్‌ శ్రీనివాస్‌ నూతన ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించారు.
    ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్‌కు ఏపీవో మంజుల, ఎంపీవో వెంకటేశ్వర్లు, సీనియర్‌ అసిస్టెంట్‌ వేణుగోపాల్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ భాస్కర్‌, టైపిస్ట్‌ వేణు, రాజు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
    అనంతరం ఎంపీడీవో శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. మండలంలోని గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహిస్తానని తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా అధికారులు, సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తానని పేర్కొన్నారు.

    మద్దూర్ నూతన ఎంపీడీవో గా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ - Additional Image