EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదం చేస్తాయి : కొమురవెల్లి ఎస్సై మహేష్

    Author M KIRAN KUMAR | 19 Sep 2026, 06:55 PM | TELANGANA
    నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదం చేస్తాయి : కొమురవెల్లి ఎస్సై మహేష్

    శబాష్‌గూడెంలో సీసీ కెమెరాలు ప్రారంభం
    ‘

    సిద్దిపేట సురక్ష నేత్ర’లో భాగంగా కెమెరాల ఏర్పాటు
    సిద్దిపేట జిల్లా, కొమురవెల్లి, సెప్టెంబర్‌ 19, హిందుస్థాన్ మీడియా: సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ రష్మి పెరుమాళ్‌, ఐపీఎస్‌ ఆదేశాల మేరకు చేపట్టిన ‘సిద్దిపేట సురక్ష నేత్ర’ కార్యక్రమంలో భాగంగా కొమురవెల్లి మండలంలోని శబాష్‌గూడెం గ్రామంలో సీసీ కెమెరాలను కొమురవెల్లి ఎస్‌ఐ మహేష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై మహేష్ మాట్లాడుతూ గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ప్రధాన కూడళ్లు, ముఖ్యమైన ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. సీసీ కెమెరాలు నేరాల నియంత్రణతో పాటు ఏదైనా ఘటన జరిగినప్పుడు దర్యాప్తులో కీలక ఆధారాలను అందించడంలో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
    గ్రామాల భద్రత కోసం ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తూ అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని సూచించారు.
    ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌, పోలీస్‌ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.