EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ధూళిమిట్ట పాఠశాల విద్యార్థినులు

    Author R K SRINIVAS | 18 Sep 2026, 07:29 PM | TELANGANA
    రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ధూళిమిట్ట పాఠశాల విద్యార్థినులు

    సెలక్షన్స్‌లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

    విద్యార్థినులను అభినందించిన హెచ్‌ఎం, సర్పంచ్‌, ఉపాధ్యాయ బృందం
    సిద్దిపేట జిల్లా, ధూళిమిట్ట, సెప్టెంబర్‌ 18, హిందుస్థాన్ మీడియా: ధూళిమిట్ట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు సాఫ్ట్‌బాల్‌ క్రీడలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల సిద్దిపేటలో సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సెలక్షన్స్‌లో పాల్గొన్న విద్యార్థినులు ప్రతిభను ప్రదర్శించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనుముల కరుణాకర్‌ రెడ్డి తెలిపారు.
    పాఠశాలకు చెందిన సుమేరా, మేఘన, హర్షిణి, భావన రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆయన వెల్లడించారు. ఈ విద్యార్థినులు రేపటి నుంచి నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లిలో నిర్వహించనున్న 11వ సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొననున్నారు.
    క్రీడల్లోనూ ప్రతిభ చాటాలి
    విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినులు మరింత ప్రతిభ కనబరిచి విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.
    విద్యార్థినులను రాష్ట్రస్థాయి పోటీలకు తీర్చిదిద్దిన పాఠశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ వెగ్గళం సతీష్‌ కుమార్‌ను కూడా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, గ్రామ సర్పంచ్‌, పాలకవర్గ సభ్యులు, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు అభినందించారు. విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలియజేసి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు.