EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

    Author B SRAVAN KUMAR | 17 Sep 2026, 05:49 PM | Array
    తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

    గ్రామ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి: సర్పంచ్ బొమ్మ మల్లయ్య
    కొండపాక, సెప్టెంబర్ 17, హిందుస్థాన్ మీడియా: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని కొండపాక మండలంలోని రాంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం గ్రామ సర్పంచ్ బొమ్మ మల్లయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు.
    ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ప్రాధాన్యతను గుర్తు చేసుకుంటూ ప్రజల సంక్షేమం, గ్రామ అభివృద్ధి కోసం పాలకవర్గం, అధికారులు, సిబ్బంది సమన్వయంతో సమష్టిగా పనిచేయాలని సూచించారు. గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.
    గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచేందుకు అందరి సహకారంతో ముందుకు సాగుతామని సర్పంచ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అనిల్, వార్డు సభ్యులు బొమ్మ స్వామి, అత్కూరి వైకుంఠం, మీశ కిష్టవ్వ, కొంతం శ్రీనివాస్, ఉండే స్వప్న, మహిపాల్ రెడ్డి, ఏఎన్‌ఎం స్వరూప, అంగన్‌వాడీ టీచర్ కవిత, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.