EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి : అందె బీరన్న డిమాండ్

    Author THADEM PRASHANTH | 15 Sep 2026, 05:27 PM | TELANGANA
    ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి : అందె బీరన్న డిమాండ్

    ఉచిత బస్సు పథకంతో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులకు నెలకు రూ.15 వేల జీవన భృతి ఇవ్వాలి

    ప్రతి ఆటో కార్మికుడికి ఎలక్ట్రిక్‌ ఆటో అందించాలి: ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌
    సిద్దిపేట, సెప్టెంబర్ 15, హిందుస్థాన్ మీడియా: ఉచిత బస్సు పథకం అమలుతో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ తెలంగాణ కార్యదర్శి అందె బీరన్న డిమాండ్‌ చేశారు. సిద్దిపేట పట్టణ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.
    ఈ సందర్భంగా అందె బీరన్న మాట్లాడుతూ ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో కార్మికుల ఆదాయం గణనీయంగా తగ్గిందని, కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందన్నారు. ఉపాధి కోల్పోయిన ప్రతి ఆటో కార్మికుడికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించడంతో పాటు నెలకు రూ.15 వేల జీవన భృతి అందించాలని డిమాండ్‌ చేశారు. అలాగే ప్రతి ఆటో కార్మికుడికి ఎలక్ట్రిక్‌ ఆటోను ప్రభుత్వం అందించి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని కోరారు.
    సిద్దిపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పాకాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఆటో కార్మికుల కుటుంబాల్లోని పిల్లల విద్యకు ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.
    సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బోదాసు మైసయ్య మాట్లాడుతూ పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల భారం ఆటో కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ఆర్థిక ఇబ్బందులతో కొందరు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొంటూ, ఆటో కార్మికులకు ప్రభుత్వం సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు.
    కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ అధ్యక్షులు రాజు, నారాయణ, ఖలీమ్, వెంకటేష్, రామమూర్తి తదితరులు పాల్గొన్నారు.