EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చినుకు కోసం మేఘాల వైపు రైతుల చూపులు...

    Author R K SRINIVAS | 12 Sep 2026, 03:48 PM | TELANGANA
    చినుకు కోసం మేఘాల వైపు రైతుల చూపులు...

    సకాలంలో వర్షాలు లేక పంటల సాగుపై ఆందోళన

    తగ్గుతున్న నీటి మట్టాలతో సాగునీటికి తప్పని తిప్పలు
    సిద్దిపేట జిల్లా, మద్దూరు–దూల్మిట్ట, సెప్టెంబర్ 12, హిందుస్థాన్ మీడియా: సకాలంలో వర్షాలు కురవకపోవడంతో మద్దూరు, దూల్మిట్ట మండలాల రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. వరుణుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడన్న ఆశతో రైతులు మేఘాల వైపు చూపులు సారిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులతో పంటల సాగుపై రైతుల్లో ఆందోళన నెలకొంది.
    ఇప్పటికే పొలాల్లో సాగు చేసిన పంటలకు తగినంత తేమ అందకపోవడంతో కొన్ని చోట్ల మొక్కలు వాడిపోయే పరిస్థితి ఏర్పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బోర్లు, బావుల్లో నీటి మట్టాలు తగ్గుతుండటంతో పంటలకు సాగునీరు అందించడం రైతులకు కష్టంగా మారుతోంది.
    ఒక్క మంచి వర్షం పడితే పంటలు తిరిగి నిలదొక్కుకునే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిసి భూమిలో తేమ పెరిగితే పంటలకు ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. అయితే సకాలంలో వర్షాలు లేకపోతే ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రెండు మండలాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
    ఇకనైనా వరుణుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించి పంటలను కాపాడాలని మద్దూరు, దూల్మిట్ట మండలాల రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.