EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి

    Author B SRAVAN KUMAR | 10 Sep 2026, 05:29 PM | TELANGANA
    చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి

    ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం
    సిద్దిపేట జిల్లా, కుకునూర్‌పల్లి, సెప్టెంబర్ 10, హిందుస్థాన్ మీడియా: వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలు, ఆమె సాగించిన వీరోచిత పోరాటం నేటి యువతకు ఆదర్శం, స్ఫూర్తిదాయకమని చిన్నకిష్టాపూర్ రజక సంఘం నాయకులు అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం చిన్నకిష్టాపూర్‌లోని ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
    ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు దొరల అరాచకాలకు, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. తన హక్కుల పరిరక్షణ కోసం, ఆత్మగౌరవం కోసం ఆమె ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
    ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆమె పోరాట స్ఫూర్తిని నేటి యువతకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.