EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గణేష్ మండపాలకు అనుమతులు తప్పనిసరి : మద్దూర్ ఎస్ ఐ అసిఫ్

    Author R K SRINIVAS | 10 Sep 2026, 02:54 PM | TELANGANA
    గణేష్ మండపాలకు అనుమతులు తప్పనిసరి : మద్దూర్ ఎస్ ఐ అసిఫ్

    నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించాలి

    మండపాల ఏర్పాటుతో ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: ఎస్‌ఐ అసిఫ్
    సిద్దిపేట జిల్లా, మద్దూరు, సెప్టెంబర్ 10, హిందుస్థాన్ మీడియా: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు ముందస్తుగా సంబంధిత శాఖల నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని మద్దూరు ఎస్‌ఐ మహమ్మద్ అసిఫ్ సూచించారు. మద్దూరు, దూల్మిట్ట మండలాల్లో గణేష్ మండపాల నిర్వాహకులు బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలను ఏర్పాటు చేసే ముందు పోలీస్, స్థానిక సంస్థల అనుమతులు పొందాలని తెలిపారు.
    మండపాల ఏర్పాటుతో ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్‌ఐ సూచించారు. విద్యుత్ సౌకర్యం, అగ్నిప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
    మండపాల వద్ద శబ్ద కాలుష్యం లేకుండా నిబంధనలకు అనుగుణంగా లౌడ్‌స్పీకర్లను వినియోగించాలని సూచించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు సూచించే నిబంధనలు, నిర్దేశించిన మార్గాలను నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
    అనుమతులు లేకుండా మండపాలు ఏర్పాటు చేయడం, నిబంధనలు ఉల్లంఘించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలిగితే సంబంధిత నిర్వాహకులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఎస్‌ఐ అసిఫ్ హెచ్చరించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించే గణేష్ ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీస్, అధికారులకు సహకరించాలని కోరారు.