EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చేర్యాలలో విద్యుత్ షాక్‌తో పాడి గేదె మృతి: తీవ్ర ఆవేదనలో రైతు ​

    Author P శివశంకర్ | 24 Aug 2026, 07:22 PM | TELANGANA
    చేర్యాలలో విద్యుత్ షాక్‌తో పాడి గేదె మృతి: తీవ్ర ఆవేదనలో రైతు ​

    చేర్యాల (హిందుస్థాన్ మీడియా):
    సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో సోమవారం విద్యుత్ షాక్‌కు గురై ఓ పాడి గేదె మృతి చెందింది.
    ​స్థానిక వివరాల ప్రకారం, పట్టణానికి చెందిన రైతు అవుశర్ల కిష్టయ్యకు చెందిన పాడి గేదె ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం (ట్రాన్స్‌ఫార్మర్) వద్ద విద్యుత్ సరఫరా అవుతున్న తీగలకు తగలడంతో అక్కడికక్కడే మరణించింది. మృతి చెందిన గేదె విలువ సుమారు రూ. 1,00,000 (లక్ష రూపాయలు) ఉంటుందని రైతు వాపోయాడు.
    ​జీవనాధారమైన పాడి గేదెను కోల్పోవడంతో రైతు కిష్టయ్య కన్నీరుమున్నీరవుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి తనకు తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు.