EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం

    Author R K SRINIVAS | 21 Aug 2026, 07:42 PM | Bhakti, TELANGANA
    భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం

    రామమందిరంలో ప్రత్యేక పూజలు.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు
    హిందుస్థాన్ మీడియా, మద్దూరు, ఆగస్టు 21: మద్దూరు మండల కేంద్రంలోని రామమందిరంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారి పనుగంటి తిరుపతయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
    వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచే మహిళలు ఇళ్లను శుభ్రం చేసుకుని పూజా ఏర్పాట్లు చేసుకున్నారు. అనంతరం అమ్మవారిని సుందరంగా అలంకరించి, కలశ ప్రతిష్ఠాపన చేసి ప్రత్యేక పూజలు, వ్రత కథ నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు తమ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని వరలక్ష్మి అమ్మవారిని ప్రార్థించారు. పూజా కార్యక్రమాల అనంతరం వ్రతం నిర్వహించిన మహిళలకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
    ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.