EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకు కృషి చేద్దాం :కొమురవెల్లి కాంగ్రెస్ నాయకులు

    Author M KIRAN KUMAR | 20 Aug 2026, 05:24 PM | TELANGANA
    రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకు కృషి చేద్దాం :కొమురవెల్లి కాంగ్రెస్ నాయకులు

    హిందుస్థాన్ మీడియా, కొమురవెల్లి: మాజీ ప్రధానమంత్రి, భారతరత్న, ఆధునిక భారత నిర్మాత స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కొమురవెల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, మత సామరస్యం, జాతీయ ఐక్యతను పెంపొందించాలనే సందేశంతో నిర్వహించే సద్భావనా దినోత్సవం ప్రజలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.
    “సమైక్యతే మన శక్తి – సద్భావనే మన ప్రగతి” అనే స్ఫూర్తితో రాజీవ్ గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని శాంతి, సౌభ్రాతృత్వం, సమానత్వంతో కూడిన బలమైన భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
    ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, యువజన నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.