EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • భక్తులతో కిటకిటలాడిన నాగదేవత ఆలయం

    Author THADEM PRASHANTH | 17 Aug 2026, 07:03 PM | Bhakti, TELANGANA
    భక్తులతో కిటకిటలాడిన నాగదేవత ఆలయం

    హిందుస్థాన్ మీడియా, సిద్దిపేట: నాగుల పంచమి సందర్భంగా సిద్దిపేట మండలంలోని గాడిచర్లపల్లి గ్రామంలో భక్తిశ్రద్ధలతో నాగదేవత పూజలు నిర్వహించారు.గ్రామంలోని నాగదేవత ఆలయం వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నాగపడిగల విగ్రహాలకు ఆవుపాలతో అభిషేకం చేశారు. అనంతరం పూలు, పండ్లు, నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.పుట్ట వద్ద మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి నాగదేవతను దర్శించుకున్నారు. కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని మొక్కులు చెల్లించుకున్నారు.నాగుల పంచమి పర్వదినం సందర్భంగా గాడిచర్లపల్లి నాగదేవత ఆలయం భక్తులతో సందడిగా మారింది. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి నాగదేవతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.