EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఏఐవైఎఫ్ మండల అధ్యక్ష, కార్యదర్శులుగా చరణ్, రాజు

    Author P శివశంకర్ | 16 Aug 2026, 05:26 PM | TELANGANA
    ఏఐవైఎఫ్ మండల అధ్యక్ష, కార్యదర్శులుగా చరణ్, రాజు

    చేర్యాల మండల కమిటీ ఎన్నిక
    హిందుస్థాన్ మీడియా, చేర్యాల: అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) చేర్యాల మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షులు జనగాం రాజ్‌కుమార్ ఆదివారం తెలిపారు.ఏఐవైఎఫ్ చేర్యాల మండల అధ్యక్షుడిగా కాశబోయిన చరణ్, ప్రధాన కార్యదర్శిగా బోడపట్ల రాజు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మేకల ప్రభాకర్, కోశాధికారిగా శనిగరం రుత్విక్, సహాయ కార్యదర్శిగా ముద్దల రాజుతో పాటు మొత్తం 11 మందితో మండల కమిటీని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ చేర్యాల మండలంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడటంతో పాటు, మండలంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఏఐవైఎఫ్‌ను మండలంలో మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.
    తమ ఎన్నికకు సహకరించిన జిల్లా అధ్యక్షులు జనగాం రాజ్‌కుమార్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్, మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు ఈరి భూమయ్య, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు గూడెపు సుదర్శన్, బొజ్జ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.