EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • శోకసంద్రంలో ఉన్న కుటుంబానికి అండగా నర్సాయపల్లి సర్పంచ్

    Author R K SRINIVAS | 15 Aug 2026, 07:43 PM | TELANGANA
    శోకసంద్రంలో ఉన్న కుటుంబానికి అండగా నర్సాయపల్లి సర్పంచ్

    మృతురాలి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం
    హిందుస్థాన్ మీడియా, మద్దూరు, ఆగస్టు 15: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లి గ్రామానికి చెందిన ముత్యాల సుశీల మృతి చెందడంతో ఆమె కుటుంబాన్ని గ్రామ సర్పంచ్ శనిగరం సత్యనారాయణ పరామర్శించారు.మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చిన సర్పంచ్, వారి బాధలో తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. అనంతరం కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.10,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు.
    ముత్యాల సుశీల మృతి ఆ కుటుంబానికి తీరని లోటని సర్పంచ్ శనిగరం సత్యనారాయణ అన్నారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.
    ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.