EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • స్వాతంత్ర్య వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ మహేష్ బి.గితే

    Author THADEM PRASHANTH | 14 Aug 2026, 07:11 PM | TELANGANA
    స్వాతంత్ర్య వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ మహేష్ బి.గితే

    పరేడ్, వేదిక, పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష
    హిందుస్థాన్ మీడియా, రాజన్న సిరిసిల్ల జిల్లా: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే శుక్రవారం సాయంత్రం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
    జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని పోలీస్ పరేడ్ మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా వేడుకల కోసం ఏర్పాటు చేస్తున్న వేదిక, పరేడ్ నిర్వహణ, వివిధ శాఖల శకటాల ప్రదర్శన, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, అధికారులు కూర్చునే ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్ తదితర అంశాలను పరిశీలించారు.ఏర్పాట్లకు సంబంధించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న ఎస్పీ, వేడుకలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.ఎస్పీ వెంట ఎస్బీ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రవి, ఆర్‌ఐలు మధుకర్, సురేష్, తహసీల్దార్ మహేష్ తదితరులు ఉన్నారు.