EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వ్యవసాయ పనుల్లో రైతు మృతి,ఫోన్ లో పరామర్శించినఎమ్మెల్యే పల్లా

    Author P శివశంకర్ | 14 Aug 2026, 12:14 AM | TELANGANA
    వ్యవసాయ పనుల్లో రైతు మృతి,ఫోన్ లో పరామర్శించినఎమ్మెల్యే పల్లా

    హిందుస్థాన్ మీడియా, చేర్యాల: చేర్యాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకుడు బండ సాయిలు వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా హఠాత్తుగా మృతి చెందారు. ఈ ఘటనతో రాంపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.బండ సాయిలు మృతి విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మృతుడి కుటుంబ సభ్యులను చరవాణి ద్వారా పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, వారికి మనోధైర్యం కల్పించారు.అనంతరం మాజీ సర్పంచ్ తివారి దినేష్ ద్వారా మృతుడి కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు.బండ సాయిలుకు భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
    కుటుంబాన్ని పరామర్శించిన వారిలో బీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు శేవల్ల కిష్టయ్య, యువజన అధ్యక్షుడు బండ ప్రసాద్, బాల్య బాల్‌రాజు గౌడ్, ముచ్చల వంశీతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.