EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బీరు బాటిల్‌లో చెత్త..??చిన్నకోడూరులో కలకలం

    Author THADEM PRASHANTH | 07 Aug 2026, 10:16 PM | TELANGANA
    బీరు బాటిల్‌లో చెత్త..??చిన్నకోడూరులో కలకలం

    రేణుక ఎల్లమ్మ వైన్స్‌లో ఘటన.. ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టాలని వినియోగదారుల డిమాండ్
    హిందుస్థాన్ మీడియా, చిన్నకోడూరు: సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ వైన్స్ లో కొనుగోలు చేసిన బీరు బాటిల్‌లో చెత్త, నాచు లాంటి పదార్థాలు కనిపించాయని ఓ వినియోగదారుడు ఆరోపించిన ఘటన గురువారం చోటుచేసుకుంది.బాధితుడు శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీ రేణుక ఎల్లమ్మ వైన్స్‌కు ఆనుకుని ఉన్న పర్మిట్ రూమ్‌లో బీరు సేవించేందుకు వెళ్లాడు. బాటిల్ తెరిచి చూడగా అందులో చెత్త, నాచు వంటి పదార్థాలు కనిపించాయని తెలిపారు. దీంతో వెంటనే వైన్స్ సిబ్బందికి విషయం చెప్పి మరో బీరు ఇవ్వాలని కోరగా, సిబ్బంది నిరాకరించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.సమాచారం అందుకున్న చిన్నకోడూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.ఈ ఘటనపై మద్యం వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విక్రయిస్తున్న మద్యం నాణ్యతపై ఎక్సైజ్ శాఖ అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి, వాస్తవాలను నిర్ధారించి, నిబంధనలు ఉల్లంఘించినట్లయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

    బీరు బాటిల్‌లో చెత్త..??చిన్నకోడూరులో కలకలం - Additional Image