EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తల్లి పాలే శిశువుకు తొలి రక్షణ : రేపాక సర్పంచ్ మల్లేశం

    Author THADEM PRASHANTH | 06 Aug 2026, 06:46 PM | TELANGANA
    తల్లి పాలే శిశువుకు తొలి రక్షణ : రేపాక సర్పంచ్ మల్లేశం

    హిందుస్థాన్ మీడియా, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాక అంగన్‌వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
    ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ కాత మల్లేశం మాట్లాడుతూ, తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించడంతో పాటు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు బలమైన పునాది వేస్తాయని అన్నారు. ప్రతి తల్లి తల్లిపాల ప్రాముఖ్యతను తెలుసుకుని శిశువులకు తప్పనిసరిగా తల్లిపాలు అందించాలని సూచించారు.
    "తల్లిపాలను ప్రోత్సహిద్దాం.. శిశువుల ఆరోగ్యాన్ని కాపాడుదాం.. ఆరోగ్యకరమైన భావితరాన్ని నిర్మిద్దాం" అనే సందేశంతో తల్లులకు అవగాహన కల్పించారు.
    ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్, అంగన్‌వాడీ టీచర్లు హంసలీల, అంజలి, ఏఎన్‌ఎం జయ, ఆశా కార్యకర్త పద్మ, సీఏ స్వరూప తదితరులు పాల్గొన్నారు.