EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దూల్మిట్టలో తహశీల్దార్ కార్యాలయ స్థలాన్ని పరిశీలించిన ఆర్డీవో రామ్మూర్తి

    Author THADEM PRASHANTH | 05 Aug 2026, 08:57 PM | TELANGANA
    దూల్మిట్టలో తహశీల్దార్ కార్యాలయ స్థలాన్ని పరిశీలించిన ఆర్డీవో రామ్మూర్తి

    కొత్త భవన నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాల పరిశీలన
    హిందుస్థాన్ మీడియా, దూల్మిట్ట: సిద్ధిపేట జిల్లా దూల్మిట్ట మండల కేంద్రంలో నూతన తహసీల్దార్ కార్యాలయ నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని హుస్నాబాద్ ఆర్డీవో రామ్మూర్తి బుధవారం పరిశీలించారు.
    ఈ సందర్భంగా మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించి సంబంధిత అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం రైతు వేదిక సమీపంలోని సర్వే నంబర్లు 252, 253, అలాగే లింగాపూర్ గ్రామ శివారులోని సర్వే నంబర్ 231లోని స్థలాలను పరిశీలించారు.
    భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కార్యాలయ నిర్మాణానికి అనువైన స్థలంపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్యామ్, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.