EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆకునూర్ లో విషాదం.. అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య

    Author THADEM PRASHANTH | 02 Aug 2026, 11:11 AM | Crime, TELANGANA
    ఆకునూర్ లో విషాదం.. అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య

    తన ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణం
    హిందుస్థాన్ మీడియా, చేర్యాల: సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కడుదూరి రాములు (64) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
    కుటుంబ సభ్యులు, స్థానికుల సమాచారం ప్రకారం, కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రాములు, మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది.
    మృతుడు రాములుకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించగా, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
    సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    HM విజ్ఞప్తి :మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నట్టు అనిపించినా, వారి ప్రవర్తనలో తేడా ఉన్నా వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం చాలా ముఖ్యం.

    ఆకునూర్ లో విషాదం.. అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య  - Additional Image