EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

    Author THADEM PRASHANTH | 31 Jul 2026, 07:18 AM | Politics, TELANGANA
    బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

    గుండెపోటుతో చికిత్స పొందుతూ యశోద ఆస్పత్రిలో తుదిశ్వాస.. బీఆర్ఎస్‌లో విషాదం
    హిందుస్థాన్ మీడియా, హైదరాబాద్: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన గత ఐదు రోజులుగా హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి 12:51 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ వార్తతో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి.
    1974 ఆగస్టు 6న వరంగల్ జిల్లా నల్లబెల్లిలో జన్మించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ ఉద్యమ ప్రారంభ దశలోనే 2001లో టీఆర్‌ఎస్‌లో చేరారు. అదే ఏడాది నల్లబెల్లి జెడ్పీటీసీగా ఎన్నికై తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం 2016–2018 మధ్య సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.
    2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన, టీఆర్‌ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) ఆవిర్భావం నుంచి పార్టీతోనే కొనసాగుతూ ప్రజా సమస్యలపై చురుకుగా పనిచేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన మరణంతో ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.