EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రోడ్డుపై లారీలు పార్కింగ్ చేయొద్దు : చేర్యాల ఎస్ ఐ అపూర్వ రెడ్డి

    Author THADEM PRASHANTH | 21 Jul 2026, 06:49 PM | Array
    రోడ్డుపై లారీలు పార్కింగ్ చేయొద్దు : చేర్యాల ఎస్ ఐ అపూర్వ రెడ్డి

    *లారీ యజమానులకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ అపూర్వ రెడ్డి*

    హిందుస్థాన్ మీడియా, చేర్యాల: రోడ్డుపై లారీలను పార్కింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాహనాలను రహదారులపై నిలిపివేయకుండా నిర్ణీత ప్రదేశాల్లోనే పార్కింగ్ చేయాలని చేర్యాల ఎస్‌ఐ అపూర్వ రెడ్డి సూచించారు.
    మంగళవారం చేర్యాల లారీ అసోసియేషన్‌ను సందర్శించిన ఎస్‌ఐ అపూర్వ రెడ్డి, లారీ యజమానులు, డ్రైవర్లతో సమావేశమై రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. రహదారులపై లారీలను నిలిపివేయడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలను నిర్దేశిత పార్కింగ్ స్థలాల్లోనే నిలిపివేయాలని సూచించారు.
    ఈ సందర్భంగా లారీ యజమానులు, డ్రైవర్లు పోలీసులకు సహకరిస్తూ రోడ్డు భద్రతకు తోడ్పడాలని ఎస్‌ఐ అపూర్వ రెడ్డి కోరారు.