EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలి.ఎస్పీ మహేష్. బి. గితే

    Author హిందుస్థాన్ మీడియా | 19 Jul 2026, 09:56 AM | TELANGANA
    సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలి.ఎస్పీ మహేష్. బి. గితే

    రాజన్న సిరిసిల్ల, హిందుస్థాన్ మీడియా: సెకండ్‌హ్యాండ్ మొబైల్ ఫోన్ల కొనుగోలు, ఎక్స్చేంజ్ సమయంలో విక్రేత ఆధార్ కార్డుతో పాటు పూర్తి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మొబైల్ షాపుల యజమానులకు సూచించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
    దొంగిలించిన లేదా పోగొట్టుకున్న మొబైళ్లను విక్రయించేందుకు వచ్చే వారిపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మొబైల్ దొంగలను పట్టించడంలో సహకరించిన షాపు యజమానులకు ప్రశంసాపత్రాలు అందజేస్తామని తెలిపారు.
    దొంగిలించిన మొబైళ్లను తెలిసి కొనుగోలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఎస్పీ, మొబైల్ పోగొట్టుకున్న వెంటనే CEIR పోర్టల్ ద్వారా బ్లాక్ చేసి సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో ఐటీ కోర్ ఎస్‌ఐ కిరణ్ కుమార్, పోలీసు సిబ్బంది, మొబైల్ షాపుల యజమానులు పాల్గొన్నారు.

    సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలి.ఎస్పీ మహేష్. బి. గితే  - Additional Image