EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చేర్యాల మండలంలో కరువు నివారణ చర్యలు చేపట్టాలి: సిపిఎం డిమాండ్

    Author P శివశంకర్ | 06 Nov 2026, 11:52 PM | TELANGANA
    చేర్యాల మండలంలో కరువు నివారణ చర్యలు చేపట్టాలి: సిపిఎం డిమాండ్

    తక్షణమే నిధులు మంజూరు చేసి కరువు సహాయక చర్యలు చేపట్టాలి: సీపీఎం జిల్లా కార్యదర్శి అముదాల మల్లారెడ్డి

    వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.50 వేలు, ఆహార పంటలకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్
    చేర్యాల, హిందుస్థాన్ మీడియా: చేర్యాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకుందని, వెంటనే ప్రత్యేక నిధులు మంజూరు చేసి కరువు సహాయక చర్యలు చేపట్టాలని సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి కామ్రేడ్ అముదాల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం చేర్యాలలోని పార్టీ కార్యాలయంలో ఎం.డి. కరీం అధ్యక్షతన నిర్వహించిన మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
    కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోందని మల్లారెడ్డి విమర్శించారు. గతంలో తీసుకొచ్చిన నల్ల చట్టాలను తిరిగి అమలు చేయాలనే ఆలోచనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుని పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. తెలంగాణలో 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించగా, వాటిలో సిద్దిపేట జిల్లాలోని చేర్యాల మండలం కూడా ఉందని గుర్తుచేశారు. అయితే కరువు మండలంగా ప్రకటించినప్పటికీ రైతులను ఆదుకునేందుకు ఇప్పటివరకు ప్రత్యేక నిధులు మంజూరు చేయలేదని, సహాయక చర్యలకు ప్రణాళిక రూపొందించలేదని ఆరోపించారు.
    ప్రభుత్వం తక్షణమే స్పందించి వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.50 వేల చొప్పున, ఆహార పంటలకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతుల పక్షాన సీపీఎం ఆధ్వర్యంలో పోరాటాలు, ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
    ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు శెట్టిపల్లి సత్తిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు కొంగరి వెంకట్ మావో, మండల కార్యదర్శి బండకింది అరుణ్, మండల కమిటీ సభ్యులు ఎం.డి. కరీం, సుర్న తిరుపతి, స్వర్గం శ్రీకాంత్, మోకు ఇంద్రసేనారెడ్డి, రేపాక కుమార్, పొన్నబోయిన శిద్దులు, గుండ్ర రవీందర్, కత్తుల నర్సింహారెడ్డి, దండ్ల రమేష్, తాడూరు నర్సింలు, మల్కని ఎల్లయ్య, నంగి మైసయ్య, గుజ్జుల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.