చేర్యాల మండలంలో కరువు నివారణ చర్యలు చేపట్టాలి: సిపిఎం డిమాండ్

తక్షణమే నిధులు మంజూరు చేసి కరువు సహాయక చర్యలు చేపట్టాలి: సీపీఎం జిల్లా కార్యదర్శి అముదాల మల్లారెడ్డి వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.50 వేలు, ఆహార పంటలకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేర్యాల, హిందుస్థాన్ మీడియా: చేర్యాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకుందని, వెంటనే ప్రత్యేక నిధులు మంజూరు చేసి కరువు సహాయక చర్యలు చేపట్టాలని సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి కామ్రేడ్ అముదాల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం చేర్యాలలోని పార్టీ కార్యాలయంలో ఎం.డి. కరీం అధ్యక్షతన నిర్వహించిన మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకంగా చట్టాలు...