EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • న్యూయార్క్ లో టీటీఏ బోర్డు సమావేశం

    Author THADEM PRASHANTH | 06 Nov 2026, 06:02 PM |
    న్యూయార్క్ లో టీటీఏ బోర్డు సమావేశం

    2025-26 విజయాలపై సమీక్ష.. చార్లెట్ కన్వెన్షన్ విజయవంతంపై హర్షం

    తెలుగు సమాజ సేవకు మరింత ప్రాధాన్యత.. భవిష్యత్ కార్యక్రమాలపై చర్చ
    న్యూయార్క్, హిందుస్థాన్ మీడియా: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) బోర్డ్ సమావేశం న్యూయార్క్‌లోని రాడిసన్ హోటల్‌లో నిర్వహించారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు, అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రాంతీయ నాయకులు సహా సుమారు 150 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2025-26లో సంస్థ సాధించిన విజయాలను సమీక్షించడంతో పాటు, అమెరికాలోని తెలుగు సమాజానికి మరింత మెరుగైన సేవలు అందించే అంశాలపై చర్చించారు.చార్లెట్‌లో నిర్వహించిన 2026 టీటీఏ కన్వెన్షన్‌ను విజయవంతం చేసేందుకు కృషి చేసిన కన్వెన్షన్ బృందం, దేశవ్యాప్తంగా ఉన్న కమిటీ సభ్యులను డాక్టర్ మల్లారెడ్డి పైళ్ల అభినందించారు. కన్వెన్షన్ విజయవంతంలో కీలక పాత్ర పోషించిన చైర్మన్ డాక్టర్ విజయపాల్ రెడ్డి, ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కన్వెన్షన్ కన్వీనర్ ప్రవీణ్ చింత, కోఆర్డినేటర్లు నరేన్ దేవరపల్లి, శేఖర్ రెడ్డితో పాటు సహోదర్ పెద్దిరెడ్డి, శివ రెడ్డి, నరసింహ పెరుకలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
    టీటీఏ అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది మాట్లాడుతూ.. సేవా డేస్, భారతదేశంలో నిర్వహించిన టీటీఏ పదో వార్షికోత్సవ వేడుకలు, నార్త్ కరోలినాలోని చార్లెట్‌లో జరిగిన 2026 టీటీఏ కన్వెన్షన్ వంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినట్లు వివరించారు. ఈ విజయాల వెనుక సంస్థ సభ్యులు, కమ్యూనిటీ అందించిన సహకారం ఉందని పేర్కొన్నారు. సమావేశానికి సహకరించిన స్పాన్సర్లు, డాక్టర్ మల్లారెడ్డి పైళ్ల, టీటీఏ అడ్వైజరీ కమిటీ, ప్రవీణ్ చింతలకు కృతజ్ఞతలు తెలిపారు.సమావేశంలో 2026 కన్వెన్షన్ బడ్జెట్, ఖర్చులు, సభ్యత్వాలపై సమీక్ష నిర్వహించారు. తదుపరి బోర్డ్ సమావేశాన్ని 2027 జనవరి చివరి వారంలో నిర్వహించే అంశంపై చర్చించారు. కొత్తగా ఏర్పడే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ బాడీతో భవిష్యత్ ప్రణాళికలు, సంస్థాగత ప్రాధాన్యతలు, రాబోయే కార్యక్రమాలపై చర్చించనున్నట్లు తెలిపారు.సమావేశ ఏర్పాట్లలో అంకితభావంతో పనిచేసిన టీటీఏ న్యూయార్క్ బృందాన్ని నాయకులు అభినందించారు. అమెరికాలోని తెలుగు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి టీటీఏ అందించగల సేవలు, భవిష్యత్ సామాజిక కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. 2025-26లో సాధించిన విజయాల స్ఫూర్తితో సమిష్టి నాయకత్వం ద్వారా సంస్థ లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో సమావేశం ముగిసింది.