న్యూయార్క్ లో టీటీఏ బోర్డు సమావేశం

2025-26 విజయాలపై సమీక్ష.. చార్లెట్ కన్వెన్షన్ విజయవంతంపై హర్షం తెలుగు సమాజ సేవకు మరింత ప్రాధాన్యత.. భవిష్యత్ కార్యక్రమాలపై చర్చ న్యూయార్క్, హిందుస్థాన్ మీడియా: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) బోర్డ్ సమావేశం న్యూయార్క్‌లోని రాడిసన్ హోటల్‌లో నిర్వహించారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు, అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రాంతీయ నాయకులు సహా సుమారు 150 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2025-26లో సంస్థ సాధించిన విజయాలను సమీక్షించడంతో పాటు, అమెరికాలోని తెలుగు సమాజానికి మరింత మెరుగైన సేవలు అందించే అంశాలపై చర్చించారు.చార్లెట్‌లో నిర్వహించిన 2026 టీటీఏ కన్వెన్షన్‌ను విజయవంతం చేసేందుకు కృషి చేసిన కన్వెన్షన్ బృందం, దేశవ్యాప్తంగా...