EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నర్సాయపల్లిలో అభివృద్ధి పనుల పరిశీలన

    Author R K SRINIVAS | 06 Nov 2026, 05:44 PM | Array
    నర్సాయపల్లిలో అభివృద్ధి పనుల పరిశీలన

    40 ఇంకుడు గుంతల నిర్మాణానికి స్థలాల గుర్తింపు.. పనులు వేగవంతం చేయాలని ఎంపీడీఓ సూచన

    అంగన్వాడీ కేంద్రంలో పేరెంట్స్, ఆరోగ్యలక్ష్మి కమిటీ సమావేశం

    నర్సాయిపల్లి, నవంబర్ 6, హిందుస్థాన్ మీడియా: మద్దూరు మండలం నర్సాయపల్లి గ్రామంలో గురువారం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్, మద్దూరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శనిగరం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎంపీడీఓ సీహెచ్. శ్రీనివాస్ గ్రామంలో పర్యటించి వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు.
    జలసిరి పనుల్లో భాగంగా గ్రామంలో 40 ఇంకుడు గుంతలు నిర్మించాలని ఎంపీడీఓ సూచించారు. సర్పంచ్, ఎంపీడీఓ ఆధ్వర్యంలో వాటి నిర్మాణానికి అవసరమైన స్థలాలను గుర్తించి మార్కింగ్ చేశారు. గ్రామంలో నిర్మించిన రెండు మహిళా భవనాలను పరిశీలించి, మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. అలాగే కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించారు.

    అంగన్వాడీ కేంద్రంలో సమావేశాలు
    నర్సాయిపల్లి అంగన్వాడీ కేంద్రం-1 పరిధిలో తల్లిదండ్రుల సమావేశం, ఆరోగ్యలక్ష్మి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చిన్నారుల తల్లిదండ్రులు, గర్భిణులు, బాలింతలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారికి అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు.అంగన్వాడీ కేంద్రం ద్వారా చిన్నారులకు అందిస్తున్న సేవలు, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం, ఆరోగ్య సేవలపై చర్చించారు. అంగన్వాడీ కేంద్రాల సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ శనిగరం సత్యనారాయణ సూచించారు.
    ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి పి. భాస్కర్, టెక్నికల్ అసిస్టెంట్ రమేష్, లబ్ధిదారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

    నర్సాయపల్లిలో అభివృద్ధి పనుల పరిశీలన  - Additional Image