నర్సాయపల్లిలో అభివృద్ధి పనుల పరిశీలన

40 ఇంకుడు గుంతల నిర్మాణానికి స్థలాల గుర్తింపు.. పనులు వేగవంతం చేయాలని ఎంపీడీఓ సూచన అంగన్వాడీ కేంద్రంలో పేరెంట్స్, ఆరోగ్యలక్ష్మి కమిటీ సమావేశం నర్సాయిపల్లి, నవంబర్ 6, హిందుస్థాన్ మీడియా: మద్దూరు మండలం నర్సాయపల్లి గ్రామంలో గురువారం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్, మద్దూరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శనిగరం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎంపీడీఓ సీహెచ్. శ్రీనివాస్ గ్రామంలో పర్యటించి వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. జలసిరి పనుల్లో భాగంగా గ్రామంలో 40 ఇంకుడు గుంతలు నిర్మించాలని ఎంపీడీఓ సూచించారు. సర్పంచ్, ఎంపీడీఓ ఆధ్వర్యంలో వాటి నిర్మాణానికి అవసరమైన స్థలాలను గుర్తించి మార్కింగ్ చేశారు. గ్రామంలో నిర్మించిన రెండు మహిళా...