EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి 5 లక్షలు ఆర్థిక సాయం అందించిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

    Author THADEM PRASHANTH | 06 Nov 2026, 04:24 PM | TELANGANA
    లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి 5 లక్షలు ఆర్థిక సాయం అందించిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

    బచ్చన్నపేట / జనగామ (హిందుస్థాన్ మీడియా):
    కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు, ప్రజలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చే జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచి పోరాడిన నిస్వార్థ ఉద్యమకారుడు, బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన దివంగత వేముల లక్ష్మణ్ గౌడ్ అకాల మరణంతో శోకసంద్రంలో మునిగిన కుటుంబాన్ని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గురువారం పరామర్శించారు . పెద్ద దిక్కును కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన ఆ కుటుంబ దీనస్థితిని చూసి చలించిపోయిన ఆయన, అక్కడికక్కడే రూ. 5 లక్షల భారీ ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబ సభ్యుల చేతులకు అందజేసి మానవత్వాన్ని నిరూపించుకున్నారు.
    ​అనంతరం కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి అండగా ఉంటామని కొండంత ధైర్యం చెప్పారు. "తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన లక్ష్మణ్ గౌడ్ లాంటి ఉద్యమకారుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివి. స్వరాష్ట్రం కోసం సర్వస్వం ధారపోసిన ఉద్యమకారుల కుటుంబాలు కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోబోం" అని కొమ్మూరి స్పష్టం చేశారు. కేవలం ఆర్థిక సాయంతోనే సరిపెట్టకుండా, బాధిత కుటుంబం గౌరవంగా బతికేందుకు పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వపరంగా లక్ష్మణ్ గౌడ్ భార్యకు తగిన ఉద్యోగం కల్పించేందుకు స్వయంగా చొరవ తీసుకుంటానని, అలాగే ప్రభుత్వం నుంచి వెంటనే ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయించి సొంతింటి కలను నెరవేరుస్తానని బహిరంగంగా హామీ ఇచ్చారు. ఉద్యమకారుడి కుటుంబానికి తక్షణమే స్పందించి అండగా నిలిచిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నాయకత్వ పటిమ, సేవా గుణంపై నియోజకవర్గవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ప్రత్యేకంగా పాల్గొని బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్, చేర్యాల మండల అధ్యక్షుడు మంజ మల్లేశం, చేర్యాల పట్టణ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్ లతో పాటు జనగామ నియోజకవర్గంలోని మండల, పట్టణ, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు .
    ​– | హిందుస్థాన్ మీడియా |
    సామాన్యుడి నేస్తం 📰