లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి 5 లక్షలు ఆర్థిక సాయం అందించిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

బచ్చన్నపేట / జనగామ (హిందుస్థాన్ మీడియా): కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు, ప్రజలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చే జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచి పోరాడిన నిస్వార్థ ఉద్యమకారుడు, బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన దివంగత వేముల లక్ష్మణ్ గౌడ్ అకాల మరణంతో శోకసంద్రంలో మునిగిన కుటుంబాన్ని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గురువారం పరామర్శించారు . పెద్ద దిక్కును కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన ఆ కుటుంబ దీనస్థితిని చూసి చలించిపోయిన ఆయన, అక్కడికక్కడే రూ. 5 లక్షల భారీ ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబ సభ్యుల...