EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చేర్యాల విద్యుత్ శాఖకు నూతన ఏడీఈగా వాసుదేవరావు

    Author P శివశంకర్ | 05 Nov 2026, 06:00 PM | TELANGANA
    చేర్యాల విద్యుత్ శాఖకు నూతన ఏడీఈగా వాసుదేవరావు

    చేర్యాల (హిందుస్థాన్ మీడియా):
    చేర్యాల విద్యుత్ శాఖ నూతన అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ)గా వాసుదేవరావు బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చేర్యాల సబ్ డివిజన్ పరిధిలోని విద్యుత్ మీటర్ రీడర్లు ఆయనను కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన బాధ్యతలు చేపట్టిన ఏడీఈ వాసుదేవరావుకు శాలువాతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.​ఈ సందర్భంగా ఏడీఈ మాట్లాడుతూ.. చేర్యాల సబ్ డివిజన్ పరిధిలోని వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు, క్షేత్రస్థాయి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బిల్లింగ్, రీడింగ్ ప్రక్రియల్లో ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో చేర్యాల టౌన్ లైన్ ఇన్‌స్పెక్టర్ (ఎల్‌ఐ) ప్రభాకర్ రెడ్డి, మీటర్ రీడర్లు రాజు, అలీం, నసీరుద్దీన్, సందీప్, కనకయ్య, వంశీ, పవన్, శివ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
    ​– | హిందుస్థాన్ మీడియా |
    సామాన్యుడి నేస్తం 📰