చేర్యాల విద్యుత్ శాఖకు నూతన ఏడీఈగా వాసుదేవరావు
చేర్యాల (హిందుస్థాన్ మీడియా): చేర్యాల విద్యుత్ శాఖ నూతన అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ)గా వాసుదేవరావు బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చేర్యాల సబ్ డివిజన్ పరిధిలోని విద్యుత్ మీటర్ రీడర్లు ఆయనను కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన బాధ్యతలు చేపట్టిన ఏడీఈ వాసుదేవరావుకు శాలువాతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఏడీఈ మాట్లాడుతూ.. చేర్యాల సబ్ డివిజన్ పరిధిలోని వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు, క్షేత్రస్థాయి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బిల్లింగ్, రీడింగ్ ప్రక్రియల్లో ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో చేర్యాల...