EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనగోళ్లు చేపట్టాలి: మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి

    Author P శివశంకర్ | 04 Nov 2026, 05:40 PM | TELANGANA
    రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనగోళ్లు చేపట్టాలి: మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి

    చేర్యాల మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
    >చేర్యాల, నవంబర్ 4, హిందుస్థాన్ మీడియా: చేర్యాల మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించారు. వేచరేణి, పోతిరెడ్డిపల్లి, నాగపురి, పెదరాజపేట, శభాష్‌గూడెం గ్రామాల్లో ఈ కేంద్రాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను నష్టపరుస్తున్నారని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, గన్నీ సంచులు, తూకం యంత్రాలు అందుబాటులో ఉంచాలని అధికారులను కోరారు. ధాన్యం తూకం, కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వ మద్దతు ధర, కొనుగోలు విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో చేర్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంజ మల్లేశ్, పట్టణ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ మెరుగు కృష్ణ, ఆత్మ కమిటీ చైర్మన్ తిరుపతి, డైరెక్టర్లు, గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, సీసీలు, సీఏలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఐకేపీ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

    రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనగోళ్లు చేపట్టాలి: మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి  - Additional Image