రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనగోళ్లు చేపట్టాలి: మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి

చేర్యాల మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం >చేర్యాల, నవంబర్ 4, హిందుస్థాన్ మీడియా: చేర్యాల మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించారు. వేచరేణి, పోతిరెడ్డిపల్లి, నాగపురి, పెదరాజపేట, శభాష్‌గూడెం గ్రామాల్లో ఈ కేంద్రాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను నష్టపరుస్తున్నారని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని...