EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ముస్త్యాలలో ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ హైమావతి

    Author THADEM PRASHANTH | 30 Oct 2026, 10:52 PM | TELANGANA
    ముస్త్యాలలో ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ హైమావతి

    ​1197 సర్వే నంబర్ పాత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని సర్వే అధికారులకు ఆదేశం
    ​

    హద్దులు నిర్ణయించి వెంటనే ఫెన్సింగ్ వేయాలని తహసీల్దార్‌కు కలెక్టర్ స్పష్టీకరణ
    ​

    ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
    ​చేర్యాల / సిద్దిపేట (హిందుస్థాన్ మీడియా):
    చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలోని ప్రభుత్వ భూములను సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే. హైమావతి శుక్రవారం స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముస్త్యాల గ్రామంలోని 1197 సర్వే నంబర్‌లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని సందర్శించి, భూమి విస్తీర్ణం, స్థితిగతులపై అధికారులతో సమీక్షించారు.
    ​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 1197 సర్వే నంబర్‌లో గతంలో ప్రభుత్వ స్థలం ఎంత ఉంది, ఇతర కేటాయింపులు ఏమైనా జరిగాయా, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలం ఎంత అనే వివరాలను పాత రికార్డుల ఆధారంగా నిశితంగా పరిశీలించాలని సర్వే అధికారులను ఆదేశించారు. సమగ్ర సర్వే నిర్వహించి హద్దులను గుర్తించిన వెంటనే, ఆ స్థలం అన్యాక్రాంతం కాకుండా చుట్టూ రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. జిల్లా పరిధిలో ప్రభుత్వ స్థలాలను ఎవరైనా కబ్జా చేసినా లేదా ఆక్రమణలకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట స్థానిక తహసీల్దార్, మండల సర్వే అధికారులు, రెవెన్యూ సిబ్బంది, గ్రామ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
    ​– | హిందుస్థాన్ మీడియా |
    సామాన్యుడి నేస్తం 📰

    ముస్త్యాలలో ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ హైమావతి  - Additional Image