ముస్త్యాలలో ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ హైమావతి
1197 సర్వే నంబర్ పాత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని సర్వే అధికారులకు ఆదేశం హద్దులు నిర్ణయించి వెంటనే ఫెన్సింగ్ వేయాలని తహసీల్దార్‌కు కలెక్టర్ స్పష్టీకరణ ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక చేర్యాల / సిద్దిపేట (హిందుస్థాన్ మీడియా): చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలోని ప్రభుత్వ భూములను సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే. హైమావతి శుక్రవారం స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముస్త్యాల గ్రామంలోని 1197 సర్వే నంబర్లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని సందర్శించి, భూమి విస్తీర్ణం, స్థితిగతులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 1197 సర్వే నంబర్లో గతంలో ప్రభుత్వ స్థలం ఎంత ఉంది, ఇతర కేటాయింపులు ఏమైనా జరిగాయా,...