EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సమాజానికి మంచి చేయడమే నిజమైన దైవ విశ్వాసం :షేక్ అబ్దుల్ బాసిత్‌

    Author THADEM PRASHANTH | 30 Oct 2026, 07:42 PM | TELANGANA
    సమాజానికి మంచి చేయడమే నిజమైన దైవ విశ్వాసం :షేక్ అబ్దుల్ బాసిత్‌

    సాటి మనుషులకు సేవ చేయడమే అసలైన ఆరాధన: షేక్‌ అబ్దుల్‌ బాసిత్‌
    భద్రాద్రి కొత్తగూడెం, హిందుస్థాన్ మీడియా: సాటి మనుషులకు కష్టం, నష్టం కలిగించకుండా వారికి మేలు చేయడమే నిజమైన దైవ విశ్వాసమని జమాతే ఇస్లామీ హింద్‌ సభ్యుడు షేక్‌ అబ్దుల్‌ బాసిత్‌ అన్నారు. పవిత్ర శుక్రవారం సందర్భంగా కొత్తగూడెం కార్పొరేషన్‌ పరిధిలోని మేదర్‌ బస్తీ మసీద్‌-ఎ-వహీద్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.
    మానవులందరూ ఒకే సృష్టికర్తకు దాసులని, తోటి మనుషులకు సేవ చేయడమే నిజమైన ఆరాధన అని పేర్కొన్నారు. సమాజానికి హాని కలిగించే పనులకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రవక్త మహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించిన సహనం, దాతృత్వం, నైతిక విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని అన్నారు.కల్తీ మద్యం, జూదం, అబద్ధాలు చెప్పడం, లంచం ఇవ్వడం, తీసుకోవడం వంటి అనైతిక చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ జీవితం ఒక పరీక్ష వంటిదని, మనకు లభించిన సంపద, జ్ఞానం, అధికారం వంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. వాటిని చూసుకుని అహంకారంతో వ్యవహరించే వారికి చివరకు పతనం తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మసీదు ఇమామ్‌ మజహర్‌, జమాతే ఇస్లామీ హింద్‌ పట్టణ అధ్యక్షుడు షారుఖ్‌ యజ్దానీ, జబ్బార్‌ సాబ్‌, ముక్తార్‌, షరీఫ్‌ బాయ్‌, నయీం ఖురైషీ, గౌస్‌ తదితరులు పాల్గొన్నారు.